యూ..ట్యూబ్‌ బేబీలు

by  |
యూ..ట్యూబ్‌ బేబీలు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా తెచ్చిన ఖాళీ టైమ్ వల్లనో లేదా అంతకు ముందు నుంచో కానీ.. పిల్లల యాప్ యూసేజ్ మటుకు చాలా పెరిగింది. యూట్యూబ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, టిక్‌టాక్, స్నాప్ చాట్ యాప్స్‌లో పిల్లలు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. స్పెయిన్, అమెరికా, యూకేలోని 4 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల ‘యాప్ యూసేజ్ హ్యాబిట్స్’ పై డిజిటల్ సేఫ్టీ యాప్ మేకర్ ‘క్యుస్టోడియో’ ఓ సర్వే నిర్వహించింది. ఫిబ్రవరి 2019 నుంచి ఏప్రిల్ 2020 మధ్యకాలంలో వీడియో గేమ్స్, ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ వీడియో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన యాప్స్ ప్రభావం.. ప్రధానంగా పిల్లలపై ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వే చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం 4-15 ఏళ్ల చిన్నారులు రోజుకు సగటును 85 నిమిషాల పాటు ఆన్‌లైన్ వీడియోలను చూస్తున్నారని.. అందులో 80 నిమిషాలు టిక్‌టాక్ చూసేందుకు వెచ్చిస్తున్నారని తేలింది.

యూట్యూబ్ టాప్ :

చిన్నారులు అత్యధికంగా ఉపయోగించే యాప్స్‌లో యూట్యూబ్‌దే అగ్రస్థానం. యూట్యూబ్ యాప్‌ను అమెరికాలో 69 శాతం, యూకేలో 74 శాతం, స్పెయిన్‌లో 88 శాతం మంది పిల్లలు ఉపయోగిస్తున్నారు. చిన్నారుల కోసం ప్రవేశపెట్టిన యూట్యూబ్ కిడ్స్ యాప్‌ను అమెరికాలో 7 శాతం చూస్తుండగా, యూకేలో 10 శాతం మంది చూస్తున్నారు. యూకే‌కు చెందిన చిన్నారులు రోజుకు 75 నిమిషాల పాటు యూట్యూబ్ చూస్తుండగా.. స్పెయిన్ చిన్నారులు 63 నిమిషాలు యూ ట్యూబ్‌లో గడుపుతున్నారు. కాగా లాక్‌డౌన్ టైమ్‌లో ఇది మరింత మరింతగా పెరిగింది. యూఎస్ చిన్నారులు 99 నిమిషాలు యూట్యూబ్‌లో గడపగా, 95 నిమిషాలు టిక్‌టాక్‌కు వెచ్చించారు. మే 2019 నుంచి ఫిబ్రవరి 2020 ద్వారా అమెరికాలో రోజుకు సగటున కిడ్స్ టిక్‌టాక్‌లో గడిపే సమయం 116 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి 2020లో అమెరికాలో టిక్‌టాక్‌ను కిడ్స్ 16.5 శాతం వాడారు. ఇన్‌స్టాగ్రామ్‌ను 20.4 శాతం, స్నాప్ చాట్‌ను 16 శాతం వాడారు.


Next Story

Most Viewed