ఆస్పత్రి ఎదుట ఆటోలోనే ప్రసవం.. పసికందు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాటు మండలం మొరంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళా పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్వవహరించారు. తీవ్ర రక్తస్రావం అవుతున్నా కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించకుండా నర్సులు గేటు బయటకు గెంటేశారని బాధిత మహిళ బంధువులు ఆరోపించారు. వైద్యులు వైద్యం అందించకుండా భద్రాచలం తీసుకెళ్లాలని చెప్పడంతో ఆ మహిళ బయటకు వచ్చి ఆటోలోనే ప్రసవించింది. దీంతో పసికందు మృతి చెందింది. వైద్యులు సకాలంలో చికిత్స అందించకపోవడంతోనే శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement