డెంగ్యూ బాధితులను పట్టించుకోరా.. సర్కార్ తీరుపై ఫైర్

by Sridhar Babu |
డెంగ్యూ బాధితులను పట్టించుకోరా.. సర్కార్ తీరుపై ఫైర్
X

దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణంలో విష జ్వరాలు విజృంభించాయి. జ్వరాల బారినపడి వందలాది మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా వైద్య ఆరోగ్య శాఖ నిద్రావస్థలో ఉందని సీపీఐ భద్రాచలం పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్ ఆరోపించారు. జగదీష్ కాలనీలో గోవర్దన పావని(12) అనే చిన్నారి డెంగ్యూతో మరణించినట్లు తెలిపారు.

చిన్నారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం విషాద ఘటనను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం డెంగ్యూ మరణాలపై స్పందించి తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిచాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ నిద్రమత్తు వీడి ప్రతీ కాలనీలో హెల్త్ క్యాంపు పెట్టాలని కోరారు. డెంగ్యూ జ్వరాలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే ఆర్థిక దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

డెంగ్యూతో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు రాజుదేవర నాగరాజు, గడ్డం నాగమ్మ, ఖాదర్, వెంకన్న తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed