స్కూల్ లో పిల్లలకు కండోమ్స్.. ఏం చేయడానికి అంటున్న పేరెంట్స్

by Anukaran |   ( Updated:2021-07-11 05:45:53.0  )
sex education in chicago
X

దిశ, వెబ్‌డెస్క్: సెక్స్.. ఈ పదం మన దేశంలో పలకడానికే భయపడతారు చాలామంది. ఇక స్కూల్ లో పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే తల్లిదండ్రులు యుద్ధానికే వస్తారు. చిన్నతనంలోనే పిల్లలకు అన్ని విషయాల గురించి తెలియాలి. అలా తెలుస్తూ పెరిగితేనే వారిలో మానసిక నైపుణ్యం పెరిగి అత్యాచారాలు మొదలు లైంగిక వేధింపులాంటి వాటికి దూరంగా ఉంటారని నిపుణల సలహా. ఇక్కడైతే సెక్స్ ఎడ్యుకేషన్ లేదు కానీ కొన్ని దేశాల్లో పిల్లలకు స్కూల్ లో వీటికి స్పెషల్ గా తరగతులు కూడా నిర్వహిస్తున్నారు.

అయితే.. ఇదంతా ఓకే కానీ సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో ఏకంగా పిల్లలకు కండోమ్స్ ని అందుబాటులో ఉంవ్హాలనే సరికొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది చికాగోలోని ఓ పాఠశాల. అందులోనూ వారి తల్లిదండ్రులకు తెలియకుండా ఆదేశాలు జారీ చేయడంతో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం పై మండిపడ్డారు. మా అనుమతి లేకుండా ఇలా చేయడం పద్ధతి కాదని ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన కు సంబంధించి పూర్తీ వివరాలు ఏంటంటే.. 5 వ తరగతిపైన చదువుతున్న విద్యార్థులకు పాఠశాలలో కండోమ్స్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డు. ఈ విధానాన్ని తప్పకుండ అమలు చేయాలనీ ఆదేశాలు కూడా జారీచేసింది. ఈ వయసునుంచే పిల్లలకు సెక్స్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విధానం పై పిల్లల తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు.

సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించడం వరకు ఓకే కానీ ఐదో తరగతి చదువుతున్న పిల్లలు 10 నుంచి 12 ఏళ్ల మధ్యలో ఉంటారు. వారికి కండోమ్స్ ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. పుస్తకాల ద్వారా నేర్పండి.. ఇలా కండోమ్స్ కిట్ ఇచ్చి నేర్పితే వారు ఏం చేస్తారు..? అంటూ మండిపడ్డారు. అయితే స్కూల్ యాజమాన్య మాత్రం.. ఇది కేవలం అవహగాహన కోసం మాత్రమే అని, విద్యార్థులకు హెచ్ఐవీ వంటి లైంగిక వ్యాధులు రాకుండా కూడా నిరోధించడానికి ఈ పద్ధతి బాగుంటుందని తద్వారా.. విద్యార్థుల మధ్య రిలేషన్ షిప్ భవిష్యత్ లో మరింత ఆరోగ్య కరంగా ఉంటుందని కూడా చెబుతోంది. మరి ఈ విధానంపై చివరికి పేరెంట్స్ గెలుస్తారా..? స్కూల్ యాజమాన్యం గెలుస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story