పిల్లలను పని మనుషులకు వదిలేసి.. వీడియోలు చేస్తున్న నటి!

by Shyam |
Chhavi Mittal Responds On Trolls
X

దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ చవి మిట్టల్‌ ఫిట్‌నెస్, హెల్తీ లైఫ్‌ స్టైల్‌పై తరుచుగా వీడియోలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. అయితే తాజాగా పెట్టిన ఓ పోస్ట్‌పై వచ్చిన కామెంట్‌తో హర్ట్ అయిన నటి.. ఆ మెసేజ్‌ను స్టోరీస్‌లో షేర్ చేసి రిప్లయి ఇచ్చింది. ‘ ఈ వీడియో చేస్తున్నప్పుడు నీ పిల్లలు ఎక్కడున్నారు? పనిమనుషులతో ఉండొచ్చు. కాబట్టి నువ్వు సూపర్ ఉమన్ కాదు’ అన్న కామెంట్‌కు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. ‘14 డే డెటాక్స్ డైట్’ వీడియోకు ఈ కామెంట్ వచ్చిందని తెలిపిన చవి మిట్టల్.. ఈ వీడియో రాత్రి 11 గంటలకు చేసినట్లు తెలిపింది. ఆఫీసు పని, ఇంటి పని పూర్తి చేసి పిల్లలిద్దరినీ పడుకోబెట్టిన తర్వాతే ఈ వీడియో చేశానని చెప్పింది. వీడియో షూట్ చేసేందుకు కేవలం 15 నిమిషాలు పట్టిందని, ఎందుకంటే దీన్ని క్రియేట్ చేసేందుకు ఎక్స్‌ట్రా ప్రిపరేషన్ ఏమీ లేదని, జస్ట్ హార్ట్ నుంచి మాట్లాడనని తెలిపింది.

అయితే ఈ కామెంట్‌పై మాత్రమే ఆన్సర్ ఎందుకిచ్చాననే విషయంపై క్లారిటీ ఇచ్చింది నటి. తోటి తల్లులు వర్కింగ్ మదర్స్‌ను జడ్జ్ చేసే పద్ధతిని మానుకోవాలని సూచించేందుకే ఇదంతా చెప్పానని తెలిపింది. ఇలాంటి నెగెటివ్ క్వశ్చన్స్ అడిగే తల్లులందరూ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించింది. పిల్లలకు స్వతంత్రంగా ఎదగడం గురించి చెప్పాలని, మహిళల స్వాతంత్ర్యం గురించి వివరించాలన్న ఆమె.. ఇంట్లో ఉన్నప్పుడు సొంతంగా, కొత్తగా ఏదైనా చేసేందుకు ప్రయత్నిస్తున్న తల్లులపై అపరాధభావాన్ని తొలగించుకోవడం మంచిదని తెలిపింది. చవి మిట్టల్‌కు కొడుకు అర్హమ్, కూతురు అరీజా ఉన్నారు.

Advertisement

Next Story