- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు ఇంటిపై దాడి.. చేవెళ్లలో ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనం
దిశ, శంకర్‌పల్లి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడటాన్ని టీడీపీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సుభాష్ యాదవ్ ఖండించారు. శనివారం టీడీపీ ఆధ్వర్యంలో చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు. వైసీపీ నేతల దాడులను పోలీసులు కూడా నిలువరించపోతున్నారని మండిపడ్డారు.
ఏపీలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు. ప్రతిపక్షపార్టీపై ఇలాంటి దాడులకు పాల్పడటం శోచనీయమని వెల్లడించారు. ఈ ఘటన చూస్తుంటే అసలు ఏపీలో ప్రజాస్వామ్యం కొనసాగుతుందా? అని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి కొమ్మిడి వెంకట్‌రెడ్డి, అధికార ప్రతినిధి ఆకుల పద్మారావు, కార్యనిర్వాహక కార్యదర్శి కాసుల సుభాన్ గౌడ్, మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణయ్య, ఎస్సీ సెల్ కార్యదర్శి మాణిక్యం, నాయకులు యాదయ్య, కాసుల వెంకటేశం, సత్యనారాయణ, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.