- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘నిధుల కేటాయింపుల్లో కేంద్రం వివక్ష’
దిశ, రంగారెడ్డి: కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపుతోందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. దేశంలో 6 రాష్ట్రాలకు 56 శాతం నిధులు ఇచ్చి మిగతా రాష్ట్రాలకు 44 శాతం మాత్రమే నిధులు కేటాయించి వివక్ష చూపుతోందన్నారు. తన పదవీకాలం ఏడాది గడిచిన నేపథ్యంలో కొండాపూర్‌లోని తన కార్యాలయంలో శనివారం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులు రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రధాని మోదీ ఫ్యూడల్ వ్యవస్థగా ప్రభుత్వాని నడుపుతున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఘోరంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. మోదీ మాటల గారడితో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైద్య, విద్య, ఉపాధి కల్పన చూపకుండా దేశ ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని ఎంపీ ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎంఎంటీఎస్‌ను వికారాబాద్ వరకు పొడిగించేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ తెలిపారు.