చెన్నై సూపర్ కింగ్స్‌లో 13 మందికి కరోనా

by  |
చెన్నై సూపర్ కింగ్స్‌లో 13 మందికి కరోనా
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ (IPL) లీగ్ 13వ సీజన్ ప్రారంభానికి మరో మూడు వారలే గడువు ఉన్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోని 13 మంది కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. ఒక బౌలర్‌తో పాటు 12 మంది సహాయక సిబ్బంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు సమాచారం. గత వారం యూఏఈ చేరుకున్న సీఎస్కే (CSK) జట్టు క్వారంటైన్ గురువారంతో ముగిసింది.

యూఏఈ చేరుకున్న తొలి రోజు, 3, 6వ రోజుల్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆరో రోజున నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో ఒక ఆటగాడితో పాటు 12 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆ 13 మందిని యాజమాన్యం (management) క్వారంటైన్‌కు పంపింది. వైరస్ బారిన పడిన వాళ్లందరూ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. వారిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనపడట్లేదని సమాచారం.

ఒకే సారి ఇంత మంది కరోనా బారిన పడటం సీఎస్కే (CSK) జట్టు యాజమాన్యాన్ని ఆందోళనలోకి నెట్టింది. శుక్రవారం నుంచి ప్రాక్టీస్ (Practice) ప్రారంభించాలని జట్టు భావించింది. అయితే పలువురు కరోనా బారిన పడటంతో వాళ్లందరూ హోటల్ గదులకే పరిమితమయ్యారు. మరోవైపు క్వారంటైన్ ముగించుకున్న ఆర్సీబీ జట్టు సరదాగా గడుపుతున్న ఫొటోలను ట్విట్టర్‌లో పెట్టారు. 53 రోజుల పాటు దుబాయ్, షార్జా, అబుదాబీ వేదికగా ఐపీఎల్ (IPL) జరుగనుంది.


Next Story