- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్‌లైన్ చాటింగ్‌తో ట్రాప్.. ఐదురోజులుగా అత్యాచారం
దిశ, వెబ్ డెస్క్: ఆన్‌లైన్ చాటింగ్ మూలంగా ఓ నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. ప్రేమ పేరుతో మోసం చేసి, ఓ యువకుడు ఆమెపై ఐదుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రం త్రిచూర్‌లో చోటుచేసుకుంది. త్రిచూర్‌లో డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతున్న ఓ యువతి ఎక్కువగా ఆన్‌లైన్ యాప్స్ వాడుతోంది. ఖాళీ టైమ్ దొరకగానే ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, షేర్‌చాట్, ట్విట్టర్ ఇలా అన్నింట్లో చురుగ్గా పాల్గొంటుంది. ఈ సమయంలో ఓ 26 ఏళ్ల యువకుడు ఆమెకు షేర్‌చాట్‌లో మెసేజ్ చేశాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదనీ, బిజినెస్ చేస్తున్నానని చెప్పి మెల్లగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం స్నేహంగా మారి, అది కాస్త ప్రేమకు దారి తీసింది. అనంతరం ఇద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరయ్యారు. దీనిని అదునుగా భావించిన ఆ యువకుడు జులై 6న బైక్‌పై ఆమె ఇంటికి వచ్చాడు. జాయ్ రైడ్ అని చెప్పి సదరు యువతిని బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అక్కడి నుంచి దూరంగా కన్నంకులంలోని చెట్లు, తుప్పలు, పొదలు, ముళ్ల మొక్కలు ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశం, ఆ పక్కనే ఓ ఇంట్లోకి తన ఇళ్లే అని చెప్పి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వరుసగా ఐదు రోజులు ఆ ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడుతూ, చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె తప్పించుకునే అవకాశం లేకుండా, ఆమె నుంచి మొబైల్ లాక్కొని… తగలబెట్టేశాడు. అప్పటికే యువతి కనిపించడం లేదని తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెల్మెట్ పెట్టుకుని, నెంబర్ లేని బండిపై తీసుకెళ్లడంతో పోలీసులకు ఛేధిచండం కొంచెం కష్టం అయ్యింది.
ఆమె సిమ్ నెంబర్ ఆధారంగా పోలీసులు, ఏ టవర్ దగ్గర ఉందో తెలుసుకున్నారు. ఆ చుట్టుపక్కల సీక్రెట్ సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఆ క్రమంలో ఒంటరిగా ఉన్న ఇంటి వద్దకు వెళ్లి కిటికీలోంచి చూడగా, ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మంచానికి చేతులు, కాళ్లు కట్టేసి ఉంచడం గమనించి, మధ్యాహ్నం మీల్స్ తేవడానికి ఇంట్లోంచి బయటకు వచ్చిన యువకుడ్ని పట్టుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఎవర్ని బడితే వాళ్లను నమ్మొద్దనీ… ఇష్టమొచ్చినట్టు ఎవరితో బడితే వాళ్లతో వెళ్లొద్దని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.