- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాంగ్‌కాల్‌లో పరిచయం.. కట్ చేస్తే ప్రేమ.. చివరికి..!
దిశ,కంటోన్మెంట్ : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసగించిన ఓ యువకుడిని బోయిన్ పల్లి పోలీసులు ఆరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇన్ స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. పాత బోయిన్ పల్లికి చెందిన రుక్సార్ బేగం(23) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుంది. 2017లో చంద్రాయణగుట్ట బండ్లగూడకు చెందిన గొల్డెన్ హైదరాబాదీ యుట్యూబ్ ఛానెల్ నిర్వహకుడు అబ్దుల్ రజాక్ (27) రుక్సార్ బేగంకు రాంగ్ కాల్ ద్వారా పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే రుక్సార్, అబ్దుల్ అతని ప్రొఫైల్ ద్వారా తెలుసుకొని పరిచయం పెంచుకుంది.
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అబ్దుల్, రుక్సార్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. వారు సన్నీహితంగా మెలిగారు. కానీ ఈ నెల 3వ తేదీన అబ్దుల్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్సార్, అబ్దుల్ ను నిలదీయగా ఆమెనే పెళ్లిచేసుకుంటానని తెగేసి చెప్పాడు. మోసపోయానని గ్రహించిన యువతి బోయిన్ పల్లి పోలీసులను అశ్రయించి ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడు అబ్దుల్ ను ఆరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.