మాజీ ఏజీ దమ్మాలపాటిపై చీటింగ్ కేసు

by srinivas |
మాజీ ఏజీ దమ్మాలపాటిపై చీటింగ్ కేసు
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై మంగళగిరిలో చీటింగ్ కేసు నమోదైంది. దమ్మాలపాటి కుటుంబం తనను మోసం చేసిందని రిటైర్డ్ లెక్చరర్ కోడె రాజా రామ్మోహన్‌ ఫిర్యాదు చేశారు.

మొత్తం నలుగురిపై 420, 406, 506, 120బి రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దమ్మాలపాటి కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో రామ్మోహన్‌ కృష్ణాయపాలెం లేక్ వ్యూ అపార్ట్‌మెంట్లు నిర్మించారు. ప్లాట్ విషయంలో తనను మోసం చేసినట్లు రామ్మోహన్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Next Story