కెల్వినా.. ఆయనేవరు..? ఈడీనే ఎదురు ప్రశ్నించిన ఛార్మి

by Sumithra |   ( Updated:2021-09-02 08:09:24.0  )
Charmi
X

దిశ,వెబ్‌డెస్క్ : డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట నటి ఛార్మి కౌర్ హాజరైన విషయం తెలిసిందే. గురువారం ఉదయం నుంచి దాదాపు 8 గంటల పాటు జరిగిన విచారణ.. కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానని, బ్యాంకు అకౌంట్ల వివరాలు ఇచ్చినట్లు ఛార్మి మీడియాకు తెలిపింది. అయితే విచారణలో భాగంగా ఛార్మికి సంబంధించిన రెండు బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో 2016లో దాదా పేరుతో లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసిన విషయాన్ని ఆమెతో చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కెల్విన్‌తో 2016లో మాట్లాడిన కాల్ డేటాను, వాట్సప్ డేటాను ఛార్మికి చూపించి అధికారులు ప్రశ్నించగా.. తనకి కెల్విన్ ఎవరో తెలియదని ఈడీకి సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

Next Story