ఓటుకు నోటు కేసు.. నిందితులపై అభియోగాలు నమోదు

by Sumithra |
ACB Court
X

దిశ, క్రైమ్ బ్యూరో: ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు నిందితులపై మంగళవారం అభియోగాలను నమోదు చేసింది. ఈ కేసు మొదలైన ఐదేండ్ల తర్వాత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధికి రాదంటూ పిటిషన్ వేశారు. దీన్ని ఇటీవలే కోర్టు కొట్టేసింది. మంగళవారం వాయిదాకు హజరైన నిందితులు రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌లపై ఏసీబీ కోర్టు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12ను నమోదు చేసింది. రేవంత్‌రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బీ, రెడ్ విత్ 34 అభియోగాన్ని నమోదు చేశారు. తమపై నమోదు చేసిన అభియోగాల్లో నిజం లేదని రేవంత్‌రెడ్డి తోసిపుచ్చారు. సండ్ర వెంకటవీరయ్యపై గతంలోనే ఈ అభియోగాలను నమోదు చేశారు. ఈ నెల 19న సాక్షుల విచారణ షెడ్యూల్డ్‌ను ఖరారు చేస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది.

ఓబుళాపురం గనుల కేసులో శ్రీలక్ష్మీ హాజరు

ఓబుళాపురం గనుల కేసు విచారణ మంగళవారం సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది. ఐఏఎస్ శ్రీలక్ష్మీ గతంలో వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. శ్రీలక్ష్మీపై మోపిన అభియోగాలకు ఆధారాలు ఉన్నాయని, అభియోగాలు నమోదు చేసి, విచారణ చేపట్టాలని సీబీఐ కోరింది. దీనిని కోర్టు ఈ నెల 23కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed