మన్నెం దొరగా చెర్రీ.. న భూతో న భవిష్యత్!

by Anukaran |   ( Updated:2021-03-26 07:48:13.0  )
Ram Charanm
X

దిశ, సినిమా : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే ఫీస్ట్ మామూలుగా లేదు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి రిలీజైన చెర్రీ ‘అల్లూరి సీతారామరాజు’ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రాజమౌళి ఎప్పటిలాగే ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయని రీతిలో చరణ్ లుక్ రిలీజ్ చేశాడు. కళ్లలో రౌద్రం.. శత్రువుల గుండెలు చీల్చేందుకు ఎక్కుపెట్టిన విల్లు.. నిప్పుకణంలా మండే రూపం.. ఐకానిక్‌గా నిలిచింది. ఇప్పటి వరకు మన్నెం దొర పాత్రలో ఎవరు కనిపించినా.. ఎన్ని ప్రశంసలు అందుకున్నా.. అల్లూరి లేటెస్ట్ లుక్‌లో చెర్రీ వారందరినీ మరిపించేశాడు. ధైర్యం, సమగ్రత, గౌరవానికి నిర్వచనాలు అందించిన అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన చెర్రీ కటౌట్ చూస్తుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతోందని అర్ధం అవుతోంది. మొత్తానికి సైలెంట్‌గా గూస్‌బంప్స్ స్టఫ్ రెడీ చేసిన చెర్రీ.. అభిమానులకు సూపర్ డూపర్ బర్త్ డే ట్రీట్ ఇచ్చేశాడు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story