ఎంసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు

by Anukaran |   ( Updated:2020-10-11 11:17:30.0  )
ఎంసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంజినీరింగ్‌లో కొత్త కోర్సులు, కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిట్టల్ ఆదివారం తెలిపారు. ముఖ్యంగా రేపు జరగాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేశారు. రేపటి నుంచి ఈనెల 20వరకు జరగాల్సిన వెబ్‌ ఆప్షన్లను 4రోజులకు కుదించి ఈనెల 18 నుంచి 22వరకు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే మొదటి విడత సీట్లను ఈనెల 22న కేటాయించాలని గతంలో చెప్పినప్పటికీ తాజా మార్పుల నేపథ్యంలో 24వ తేదీన కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి మొదలు కానున్న సర్టిఫికెట్ల పరిశీలన యథాతథంగా ఈనెల 20వరకు కొనసాగుతుందన్నారు.

Advertisement

Next Story