రెండో ప్రాధాన్యత ఓట్లలో మారిన సమీకరణాలు..

by Shyam |
రెండో ప్రాధాన్యత ఓట్లలో మారిన సమీకరణాలు..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రెండో ప్రాధాన్యత ఓట్లలో స్వల్పంగా సమీకరణాలు మారుతున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పూర్తిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యం సాధించారు. కానీ ఒక్క రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు విషయానికొస్తే.. కోదండరామ్ పుంజుకుంటున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో 56వ రౌండ్ వచ్చేసరికి కోదండరామ్‌కు 461 ఓట్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డికి 415 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 387 ఓట్లు వచ్చాయి.
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 56వ రౌండ్ ముగిసేసరికి పల్లా రాజేశ్వర్ రెడ్డి (1,10,840+415) 1,11,255, తీన్మార్ మల్లన్నకు (83,290+387) 83,677, కోదండరామ్‌కు (70,072+461) 70,533 ఓట్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా 27,578 ఓట్ల ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed