జాబిల్లిపై మన రోవర్ సురక్షితం!

by  |
జాబిల్లిపై మన రోవర్ సురక్షితం!
X

న్యూఢిల్లీ: జాబిల్లిపై చంద్రయాన్ 2 రోవర్ సురక్షితంగానే ఉన్నదని చెన్నైకి చెందిన ఇంజనీర్ శణ్ముగ సుబ్రమణియన్ గుర్తించారు. గతేడాది ప్రయోగించిన చంద్రయాన్ 2 ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై నెమ్మదిగా ల్యాండ్ కాక ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించిన శణ్ముగ సుబ్రమణియన్‌ను నాసా ప్రశంసించింది.

తాజాగా, అతనే ల్యాండర్‌కు కొద్ది దూరంలోనే రోవర్ ప్రగ్యాన్ భద్రంగా ఉన్నదని పేర్కొన్నారు. అమెరికా స్పేస్‌క్రాఫ్ట్ ఎల్‌ఆర్‌వో తీసిన చిత్రాల్లో ప్రగ్యాన్ స్పాట్‌ను గుర్తిస్తూ ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. విక్రమ్ శకలాల నుంచి ప్రగ్యాన్ రోవర్ కొన్ని మీటర్లు రోల్ అయిందని వివరించారు. అంతేకాదు, ఇక్కడి నుంచి పంపిన సందేశాలను ల్యాండర్ రిసీవ్ కూడా చేసుకుందేమోనని, వాటిని రోవర్‌కు పాస్ చేసి ఉండొచ్చని తెలిపారు. అయితే, వాటిని తిరిగి భూమికి పంపడంలో విఫలమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తాను గుర్తించిన ఫొటోలను సుబ్రమణియన్ ఇస్రోకు మెయిల్ చేశారు.



Next Story