- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేధింపులు తాళలేక చంద్రమోహన్ సూసైడ్
దిశ, వెబ్‌డెస్క్: లోన్ యాప్‌లు మరొకరి ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాయి. డబ్బు చెల్లించాలని నిర్వాహకులు పదే పదే ఒత్తిడి చేస్తూ తెలిసిన వారికి మెసేజ్‌లు పెట్టడంతో గిల్టీగా ఫీలైన ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. మేడ్చల్ జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ అనే వ్యక్తి లోన్ యాప్‌లో రుణం తీసుకున్నాడు. అయితే ఆ డబ్బులు చెల్లించేందుకు కొద్దిగా లేట్ కావడంతో నిర్వాహకుల నుంచి పదే పదే ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి.
ఇదేక్రమంలో రెచ్చిపోయిన లోన్ యాప్ నిర్వాహకులు చంద్రమోహన్ సెల్‌ఫోన్‌లోని నెంబర్లకు మేసేజ్‌లు పంపడంతో పాటు పలువురిని బెదిరించినట్లు తెలుస్తోంది. దగ్గరి బంధువులకు ఫోన్‌లు వెళ్లడంతో మనస్తాపానికి గురైన చంద్రమోహన్ శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలోనే లోన్ యాప్ నిర్వాహకుల బెదిరింపులపై చంద్రమోహన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.