డీజీపీకి చంద్రబాబు లేఖ

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. అంతేగాకుండా రాష్ట్రవ్యాప్తంగా దళితులపై, జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. దీనిపై వెంటనే స్పందించి, దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని డీజీపీని చంద్రబాబు కోరారు.

Advertisement