- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గ్యాస్ లీక్ ఘటనపై ప్రధానికి.. చంద్రబాబు లేఖ
by srinivas |

X
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై చంద్రబాబు.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని లేఖ ద్వారా కోరారు. ‘‘ ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంపై విచారణకు సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలి. విష వాయువు విడుదలకు దారితీసిన అంశాలపై క్షుణంగా విచారణ చేపట్టాలి. కంపెనీ మాత్రం స్టైరీన్ వాయువు లీకైనట్టు మాత్రమే చెబుతోంది. అయితే స్టైరీన్‌తో పాటు మరికొన్ని వాయువులు లీకైనట్లు నివేదికలు తెలుపుతున్నాయి.’’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని చంద్రబాబు ప్రధాని మోదీని కోరారు.
Tags: chandrababu, letter, pm modi, gass leak, vishaka, ap
Next Story