వైసీపీ వాళ్లేనా.. మా కార్యకర్తలకు హక్కు లేదా?: చంద్రబాబు

by srinivas |
వైసీపీ వాళ్లేనా.. మా కార్యకర్తలకు హక్కు లేదా?: చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్త రాకేశ్‌ను విడుదల చేయాలని డీజీపీ గౌతంమ్ సవాంగ్‌కు లేఖకు రాసినట్లు ట్విట్టర్ ద్వారా చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ కార్యకర్త అరెస్ట్‌ను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

తనపై వైసీపీ కార్యకర్తలు విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో.. ప్రతిగా రాకేశ్ కూడా పోస్టులు పెట్టారని.. దీంతో ఆయన్ను స్టేషన్ పిలిచి అరెస్ట్ చేయడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ వాళ్లే పోస్టులు పెట్టాలా? టీడీపీ వాళ్లు పోస్టులు పెట్టకూడదా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాకేశ్‌ను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డీజీపీని కోరారు.

Advertisement

Next Story