- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారందరికీ చేతులెత్తి మెుక్కుతున్నా..చంద్రబాబు
దిశ, ఏపీ బ్యూరో: కరోనా విపత్తులో వైద్యుల సేవలు అజరామరం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాలు నిలబెడతారు కాబట్టే వైద్యులను భగవంతునితో పోలుస్తారని చెప్పుకొచ్చారు. కరోనా విలయానికి గురైన మానవాళిని రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యక్ష దైవాలకు చేతులెత్తి మొక్కుతున్ననంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ అపాయమని తెలిసి కూడా ప్రాణాలకు తెగించి వైద్యులు శ్రమిస్తున్నారని కొనియాడారు. మానవసేవే మాధవసేవని నమ్మి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ వైద్యులు చేస్తున్న పోరాటం చిరస్మరణీయమన్నారు. వృత్తిపై అంకితభావంతో రాత్రింబవళ్లు కరోనా బాధితుల కోసం పనిచేస్తున్న వైద్యుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అది చాలా బాధాకరమన్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులకు ఏపీలో నేటికీ డాక్టర్లకు కనీసం రక్షణ పరికరాలు కూడా ఇవ్వని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యుల సేవలను గుర్తించాలన్నారు. ప్రజల ప్రాణాలను రక్షిస్తున్న వైద్యులకు ప్రభుత్వం రక్షణగా నిలవాలని చంద్రబాబు ప్రకటనలో డిమాండ్ చేశారు.