సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. శనివారం ఢిల్లీలో..

by srinivas |   ( Updated:2021-10-20 06:14:12.0  )
babu
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల నివాసాలపై వైసీపీ శ్రేణుల దాడులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దాడులను నిరసిస్తూ బుధవారం రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చిన చంద్రబాబు తాజాగా‘ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు‘ పేరుతో దీక్ష చేపట్టనున్నారు. గురువారం ఉదయం 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8గంటల వరకు అంటే 36 గంటలపాటు దీక్ష కొనసాగుతుందని ఆ పార్టీ ప్రకటించింది. అంతటితో ఆగలేదు. హోంమంత్రి అమిత్‌షాను నేరుగా కలిసి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రహోంశాఖను అపాయింట్మెంట్ కోరగా శనివారం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో శనివారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఫిర్యాదు చేయనున్నారు.

మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంతోపాటు రాష్ట్రంలోని పలు పార్టీ కార్యాలయాలు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై వైసీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులపై చంద్రబాబు హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయనున్నారు. ఇకపోతే మంగళవారం దాడి జరిగిన వెంటనే చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేయిస్తున్నారని అమిత్ షాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయానికి కేంద్ర భద్రతాబలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడుల అంశంపై ఏపీ పోలీస్ అధికారులతో మాట్లాడతానని చంద్రబాబుకు అమిత్ షా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed