నాయకులు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి: క్లాస్ పీకిన చంద్రబాబు

by srinivas |   ( Updated:2021-03-07 08:42:08.0  )
chandrababu
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ టీడీపీ నేతలకు ఆపార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. ఆదివారం రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు పోటీ చేసే అభ్యర్థులను పక్కకు రావాలని.. నేతలను వెనక్కి వెళ్లాలని సూచించారు. మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలను పక్కకు జరిపి అభ్యర్థులను ముందుకు తీసుకు వచ్చారు. వాళ్లను పరిచయం చేయాలని… వాళ్లే అభ్యర్థులని.. మీరు కాదంటూ సుతిమెత్తగా చెప్పుకొచ్చారు. వారిని చూసే నాలుగైదు ఓట్లు ఎక్కువ వస్తాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులు ఎక్కడ తగ్గాలి… అభ్యర్థులు ఎక్కడ ముందుండాలనేది తెలియాల్సిన అవసరం ఉందంటూ హితవు పలికారు. తాను పవిత్రమైన కార్యక్రమంపై ఇక్కడికి వచ్చానని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలపై బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసంతృప్త నేతలకు పరోక్షంగా క్లాస్ పీకారంటూ చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story