‘చంద్రబాబు రాయలసీమ ద్రోహి’

by srinivas |   ( Updated:2021-07-25 08:47:23.0  )
‘చంద్రబాబు రాయలసీమ ద్రోహి’
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన కరవు ప్రాంతానికి తాగు, సాగు నీరు రాకుండా బాబు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు రావడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అందుకే టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించిన తమ ప్రభుత్వం అధిగమిస్తోందన్నారు. చిత్తూరు జిల్లా ప్రజలకు తమ ప్రభుత్వం తాగు, సాగు నీరు అందించి తీరుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story