- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్సీల పోరాటం చిరస్థాయిగా నిలుస్తుంది: చంద్రబాబు
దిశ, ఏపీ బ్యూరో: శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. పార్టీ నేతలతో శాసన మండలి పరిణామాలపై ఆన్‌లైన్ సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ మంత్రుల దాడులను తట్టుకుని ఎమ్మెల్సీలు పోరాటం సాగించడం అభినందనీయమన్నారు.
అనారోగ్యం, వృద్ధాప్యం వంటి అంశాలను లెక్కచేయకుండా తమ ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరయ్యారని ప్రశంసించారు. ఇదే పోరాట స్ఫూర్తి భవిష్యత్తులోనూ కొనసాగించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆకాంక్షలను చట్టసభల్లో ప్రతిబింబించాలని సూచించారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగిన కొందరు చరిత్రహీనులయ్యారనీ, పార్టీ మారిన నేతలను విమర్శించారు. ఉన్మాదిపై పోరాటంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులను మళ్లీ తెచ్చారని, రూల్ 90 కింద చర్చించాలని కోరితే దాడులకు దిగారని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలా? లేక, రాజధాని తరలింపు సమావేశాలా? అంటూ ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లును ఎవరు ఆపారో వీడియోలు, రికార్డులు చూస్తే బయటపడుతుందని బాబు తెలిపారు.