మాజీ ఎమ్మెల్యే మృతికి చంద్రబాబు నివాళి

by srinivas |
మాజీ ఎమ్మెల్యే మృతికి చంద్రబాబు నివాళి
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… చిత్తూరు శాసనసభ్యురాలిగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. తాగునీటి కొరత నివారణకు, చెరువుల అభివృద్దికి కృషి చేశారని తెలిపారు. తమ పరిశ్రమలు, విద్యాసంస్థలలో ఎందరికో ఉపాధి కల్పించినట్టు గుర్తుచేశారు. శ్రీనివాస ట్రస్ట్ ద్వారా జిల్లాలో డీకే కుటుంబం అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. డీకే కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చంద్రబాబుతో పాటు సత్యప్రభ మృతికి టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నారా లోకేష్​, పార్టీ కేంద్ర కార్యాలయంలో నివాళులర్పించారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

Advertisement

Next Story