- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రశ్నించే హక్కును అడ్డుకోరాదు..
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: కుప్పం నియోజక వర్గంలో ఉద్రిక్తతలను వైసీపీ సృష్టిస్తోందనీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్‌ను సోమవారం నిర్వహించారు. రౌడీయిజం, గూండాయిజానికి వైసీపీ పాల్పడుతోందని ఆయన అన్నారు. బీసీ, ఎస్పీ,ఎస్టీ, మైనార్టీలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన చెప్పారు. జగన్ నియోజక వర్గమైన పులివెందులకు టీడీపీ హయాంలో నీళ్లిచ్చామని ఆయన తెలిపారు. వివక్ష లేకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం చేశామని ఆయన తెలిపారు. రైతులు, పేదల సమస్యలపై పోరాడటం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని అన్నారు. ప్రశ్నించే హక్కును అడ్డుకోరాదని ఆయన చెప్పారు. అధికారాలకు హద్దులు ఉన్నాయనీ ఆయన తెలిపారు.
Next Story