- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమాషాలు చేస్తున్నారా?.. ఖబడ్దార్: చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని, భూముల దగ్గరకు వస్తే ఖబడ్దార్ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు హెచ్చరించారు. శనివారం విజయనగరం జిల్లా రామతీర్థం చేరుకున్న చంద్రబాబు మెట్లమార్గం ద్వారా బోడికొండపైకి వెళ్లి, విగ్రహ ధ్వంసం ప్రదేశాన్ని పరిశీలించారు. రాముడి శిరస్సును ధ్వంసం చేసి పడేసిన కోనేరును పరిశీలించి పూజారులు, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… శ్రీరాముడిని కాపాడే బాధ్యత సీఎం జగన్‌కు లేదా అని ప్రశ్నించారు. ఈ సీఎంను నరరూప రాక్షసుడు అనాలా లేకుంటే ఏమనాలి.. దేశమంతా జై శ్రీరామ్ నినాదం మార్మోగుతుంటే ఉత్తరాంధ్ర అయోధ్యలో రామచంద్రుడి తలనరికారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి సీఎం జగనే కారణమని, నా హయాంలో మసీదులు, చర్చిలపై దాడులు జరిగాయా అన్నారు.
మనల్ని కాపాడుకునే దేవుడిని మనం కాపాడుకోలేమా ? సీఎం హోదాలో ఉండి మత మార్పిడులు చేయాలనుకోవడం ద్రోహమని, కేవలం ఒక మతానికే కొమ్ము కాస్తారా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. విగ్రహాలు చోరీ అయితే ఏమైతుందని బూతుల మంత్రి అంటున్నారని ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌కు బైబిల్ సెంటిమెంట్ ఉన్నట్లే మనకు వెంకటేశ్వరస్వామి సెంటిమెంట్స్ ఉంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు తమాషాలు చేస్తున్నారని, అందరూ తిరగబడితే పోలీసులు పారిపోతారని, నా ముందే తోక తిప్పుతారా ? ఇలాంటి చోటామోటా నాయకుల్ని చాలామందిని చూశా, నా దగ్గర మీ నాటకాలు నడవవు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇది పులివెందుల రాజకీయం అనుకుంటున్నారా ? బాబాయ్‌ని చంపినా అడిగేవారు లేరనుకుంటున్నారా అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. 19నెలల సీఎం జగన్ పాలనలో 127దేవాలయాలపై దాడులు జరిగాయని, ప్రతి ఒక్క కేసును రీ ఓపెన్ చేయిస్తానన్నారు. తప్పుడు కేసులు పెట్టినవారికి శిక్షతప్పదంటూ ఘాటు వ్యాఖ్యటు చేశారు.