షర్మిల రోడ్డున పడింది.. వైసీపీకి ఎందుకు ఓటెయ్యాలి

by srinivas |
Chandrababu
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో ఏకపక్ష ఎన్నికలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్‌ను విత్ డ్రా చేశారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు 50 శాతం గెలిచారని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో రూ.500 ఉన్న ఇంటి పన్ను.. మున్సిపల్ ఎన్నికల అనంతరం రూ.5000 వేలు కాబోతోందని సంచలన ఆరోపణలు చేశారు. అమ్మఒడి రూ.14000, నాన్న బుడ్డి రూ.36 వేలు, అప్పుడు, ముద్దులు పెట్టాడు.. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని ఎద్దేవా చేశారు. అంతేగాకుండా.. సోదరి షర్మిల రోడ్డున పడింది.. ఊరూరా తిప్పి పదవులు, ఆస్తులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యపై జగన్ ఎందుకు సీబీఐ దర్యాప్తు వద్దంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed