వైసీపీ ఓటమికి తిరుపతి వేదిక: చంద్రబాబు

by Anukaran |   ( Updated:2020-11-16 09:55:23.0  )
Chandrababu Naidu
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక వైసీపీ ఓటమికి వేదిక కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని నిర్ణయించామన్న చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వైసీపీ అరాచకాలకు తిరుపతి నుంచే అడ్డుకట్ట వేయాలన్నారు. అమరావతి రాజధానిని విశాఖకు తరలించి, రాయలసీమకు రాజధానిని జగన్ దూరం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా, సోమశిల, కండలేరు నీళ్లు తీసుకొచ్చిన ఘనత టీడీపీదే అన్నారు. దీనికి తోడుగా జిల్లాలో లక్షా 70 వేల ఇండ్లను మంజూరు చేశామన్నారు. కట్టిన ఇండ్లను ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం పేదలను శిథిలావస్థకు చేరుస్తున్నారని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తే.. రేణిగుంటలో 15 వేల కోట్ల పెట్టుబడితో వచ్చిన రిలయన్స్‌ను వెళ్లగొట్టారని చంద్రబాబు విమర్శించారు. ఆఖరికి అమర్‌రాజా ఇన్‌ఫ్రా టెక్‌కు ఇచ్చిన భూములను లాక్కున్నారన్నారు.



Next Story

Most Viewed