నా సన్నిహితుడికి కరోనా విచారకరం: చంద్రబాబు

by srinivas |
TDP
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ సీనియర్ నేత అచ్చన్నాయుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అచ్చెన్న తనకు అత్యంత సన్నిహితుడని.. కరోనా సోకడం తనను తీవ్రంగా బాధిస్తుందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని.. త్వరలో అసుపత్రిని డిశ్చార్జి కావాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. కాగా, అచ్చెన్నాయుడు ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. అయితే ఆయన ఇటీవల అనారోగ్యం కారణంగా ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ‌

Advertisement

Next Story