- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు
దిశ, ఏపీ బ్యూరో: 600 రోజుల అమరావతి రైతుల ఉద్యమం చారిత్రాత్మకమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ రెడ్డి చేస్తున్న దాడి కేవలం అమరావతిపై మాత్రమే కాదని యావత్ రాష్ట్రసంపదపై దాడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేయాలని ఎంత ప్రయత్నించినా మొక్కవోని దీక్షతో రైతులు చేస్తున్న ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కన్నతల్లిలాంటి 32,323 ఎకరాల భూమిని రైతులు, రైతు కూలీలు త్యాగం చేశారని కొనియాడారు. వారిచ్చిన భూమిలోనే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగులకు ఇళ్ళు నిర్మించాలని తమ ప్రభుత్వం భావించిందన్నారు.
అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్, నేల పటుత్వం లేదని, ముంపు ప్రాంతమని, అన్ని వర్గాల ప్రజలుంటే ఒక సామాజిక వర్గమే ఉందంటూ రకరకాల అసత్య ప్రచారాలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పుఇచ్చినా వైసీపీ తప్పుడు ప్రచారం మాత్రం మానలేదని విమర్శించారు. రాజధానిలో రోడ్లకు వేసిన కంకరను దొంగతనంగా తవ్వుకుని, హైకోర్టు సమీపంలో ఇసుకను మాయం చేసే స్థితికి వచ్చారని ఆరోపించారు. చివరకు అంబేద్కర్ స్మృతి వనాన్ని కూడా చెడగొట్టారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.