- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా సస్పెన్షన్ వెనుక కుట్రకోణం దాగి ఉంది: సుధాకర్
నర్సీపట్నం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో నాసిరకం వైద్య సేవలందుతున్నాయని, కరోనా వైద్యానికి సరైన మాస్కులు కూడా సరఫరా చేయడం లేదని, వైద్యులైన తమకు మాస్కులు ఇవ్వకుండా రాజకీయ నాయకులు, పోలీసులకు మాస్కులు ఎందుకు ఇస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎనస్థీషియన్ డాక్టర్ కె.సుధాకర్‌ను జిల్లా సూపర్నెంట్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వంపై అనుచిత ఆరోపణలు చేయడంపై నాలుగు కేసులు నమోదు చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తనను సస్పెండ్ చేయడం వెనుక కుట్రకోణం దాగుందని అన్నారు.
దీనిపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగా సీఎంకు రాసిన లేఖలో టీడీపీ అధినేత డాక్టర్ సస్పెన్షన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో కరోనాకి వైద్యమందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది మనోధైర్యం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. మాస్కులు, గ్లౌజులు అడిగిన పాపానికి వైద్యుడ్ని సస్పెండ్ చేసిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేని ఆయన విమర్శించారు. సుధాకర్ చేసిన వ్యాఖ్యను సానుకూలంగా చూడాలే తప్ప, ప్రతికూల చర్యలు చేపట్టకూడదని ఆయన సూచించారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ దీనిపై స్పందిస్తూ.. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్‌ని సస్పెండ్ చేయడం జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వైద్యులు కరోనా బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు సిబ్బందికి కరోనా సోకిందంటే..ఇక ప్రజల పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. కరోనా నివారణకు ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు..మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వకపోవడం వల్లే కరోనా సోకిందన్నారు. ఈ పరిస్థితికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Tags: Doctor, Sudhakar, Suspension, TDP, Chandrababu naidu, Nara lokesh