- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇది ప్రభుత్వ వైఫల్యమే: చంద్రబాబు
X
దిశ, వెబ్‌డెస్క్: నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన “ఎగుమతుల సన్నద్ధత సూచి 2020″లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉండటం విచారకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన.. అతి పొడవైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్రం… కనీసం ఇతర 8 తీర ప్రాంత రాష్ట్రాలతో కూడా పోటీ పడలేక 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పోర్టులు లేకున్నా తెలంగాణ 6వ స్థానంలో ఉంటే, 11 మైనర్ పోర్టులు, 1మేజర్ పోర్టు ఉన్నప్పటికీ ఏపి ఇలా దిగజారడం.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అంటూ విమర్శించారు. “తీరప్రాంత రాష్ట్రమైనా పాలసీపరంగా ఏపీ పనితీరు నాసిరకంగా ఉందని” నీతి అయోగ్ వ్యాఖ్యానించడం కన్నా అవమానం ఏముంది? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
Advertisement
Next Story