ఆ హీరోయిన్ ట్రాన్స్‌జెండర్.. రివీల్ చేసిన స్టార్ డైరెక్టర్

by Shyam |
janvikhapur
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా – వాణీ కపూర్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘చంఢీగఢ్ కరే ఆషికీ’. కాగా ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదలవుతున్న నేఫథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమాను పూర్తిగా ఎల్‌జీబీటీక్యూ కథాంశంతో తెరకెక్కించినట్లు తెలిపాడు.

ఈ సినిమా కోసం ఎల్‌జీబీటీక్యూ మహిళను తీసుకోవాలనుకున్నాం కానీ ట్రాన్స్ కమ్యూనిటీపై తీయబోయే తన మొదటి చిత్రం కాబట్టి ఇందులో పూర్తిగా సున్నితమైన అంశాలను జోడించామన్నారు. ట్రాన్స్ అమ్మాయిని పెట్టి తీస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహంతో ఆ సాహసం చేయలేకపోయాం అన్నారు. అలాగే ట్రాన్స్‌జెండర్లు మాత్రమే ట్రాన్స్ క్యారెక్టర్స్ ఎందుకు చేయాలన్న ఆయన… సమాజంలో ట్రాన్స్ జెండర్ల అభిప్రాయాలను మనం గౌరవించాలన్నారు. ఒక ట్రాన్స్ డైరెక్టర్ మాత్రమే ట్రాన్స్ ఫిల్మ్ చేయాలని లేదని, దళితులే దళితుల పాత్రలు పోషిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే ప్రతి ఒక్కరూ సాటి మనిషిని గౌరవించి ఆలింగనం చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed