వృక్షాలకూ అంబులెన్స్

by Shamantha N |
వృక్షాలకూ అంబులెన్స్
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా మనుషులకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగినా వెంటనే స్థానికులైనా, బాధితులైనా అంబులెన్సులకు సమాచారం ఇస్తారు. అంబులెన్సులకు సాధారణంగా మనుషుల కోసం వాడటం మనం ఇప్పటి వరకూ చూశాం. అక్కడకక్కడా జంతువుల కోసం కూడా వాడుతుంటారు. కానీ కాస్త వింతగా ఓచోట జబ్బుపడ్డ చెట్లకు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తేవడం మనం ఇప్పటివరకూ వినలేదు. మొక్కలకూ ప్రాణం ఉంటుందని జగదీశ్ చంద్రబోస్ పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేగాకుండా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో చెట్ల విలువ, మనం కాపాడుకోవాల్సిన విధానం, మనం చెట్లను పాడు విధానం కూడా ఆ సినిమాలో స్పష్టంగా చూపించాడు. అంతేకాదు…. స్పందన కూడా ఉంటుందని ప్రయోగాలతో సహా నిరూపించారు. అలా ఆయన చెప్పిన దానిని చండీగఢ్ అధికారులు అక్షరాలా, నమ్మకంగా తమ విశ్వాసంలోకి తెచ్చుకొని ఆచరణలో చేసి చూపిస్తున్నారు.

జబ్బుపడ్డ వృక్షాలకు సరైన చికిత్స అందించడానికి చండీగఢ్ పర్యావణ శాఖ అధికారులు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ”క్రిమి కీటకాలతో, చీడ పురుగులతో జబ్బుపడ్డ వృక్షాల కోసం ఈ ఎమర్జెన్సీ సర్వీసు (అంబులెన్స్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి, ఓ ప్రత్యేకమైన ఫోన్ నెంబరును కూడా ఏర్పాటు చేశారు. చికిత్స నిమిత్తం ఓ బృందాన్ని కూడా వెంటనే పంపుతాం” అని దేవేంద్ర దలై అన్న అధికారి ప్రకటించారు.

Advertisement

Next Story