- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TRS మీట్‌లో గులాబీ లీడర్ ఆత్మహత్యాయత్నం
by Shyam |

X
దిశ, చండూరు : నల్గొండ జిల్లా చండూరు మండలం అంగడిపేట బిజెఆర్ గార్డెన్‌లో గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పట్టభద్రుల సన్నాహక సమావేశం జరిగింది. ఈ మీట్‌లో మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఎస్.కె చాంద్ పాషా సమావేశం ముగిసిన వెంటనే ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తాను రూ.6 లక్షలకు ప్లాట్ కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుంటే గ్రామానికి చెందిన ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకులు పోలీసుల అడ్డుపెట్టుకుని తనను వేధిస్తున్నారని ఆరోపించాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడి నుంచి తరలిస్తుండటంతో ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన చేయసాగాడు. ఈ ఘటనపై పల్లా రాజేశ్వర్ రెడ్డి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని వివరాలు అడిగినట్లు తెలిసింది.
Next Story