- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టిస్టులారా.. బుర్జ్ ఖలీఫా పిలుస్తోంది!
దిశ, వెబ్‌డెస్క్ : ఆర్టిస్ట్ తన ఊహాల్లోని రూపానికి కాన్వాస్ మీద జీవం పోస్తాడు. ఈ క్రమంలో అందమైన కుంచె కూడా ఆర్టిస్ట్‌కు బొమ్మలు వేసేందుకు స్ఫూర్తినిస్తుంది. మరి అలాంటి ఆర్టిస్ట్‌కు బుర్జ్ ఖలీఫానే కాన్వాస్‌గా మారితే? అర్థం కాలేదా.. దుబాయ్‌లోని అత్యద్భుత కట్టడం బుర్జ్ ఖలీఫా ‘ఓపెన్ కాల్’ పేరుతో ఇటీవలే ఓ క్యాంపెయిన్ ప్రారంభించింది. అందులో భాగంగా ప్రపంచవ్యాప్త ఆర్టిస్ట్‌లకు తమ ఆర్ట్ వర్క్‌ను పంపించాల్సిందిగా ఆహ్వానం పలుకుతోంది.
నిత్యం ఎల్ఈడీ వెలుగుల్లో మెరిసిపోతుండే బుర్జ్ ఖలీఫా భవనంపై సందర్భానుసారంగా వివిధ రూపాలు సందడి చేస్తుంటాయి. మన దేశ త్రివర్ణ పతాకం కూడా అక్కడ రెపరెపలాడింది. అయితే బుర్జ్ ఖలీఫా.. కొత్త సంవత్సరం వరకు ప్రతి వారం ఓ ప్రత్యేకమైన, అత్యద్భుతమైన ఆర్ట్ వర్క్‌ను ఎల్ఈడీ వెలుగులతో ప్రదర్శించాలనుకుంటోంది. అందుకోసం ఆర్టిస్ట్, ఎమర్జింగ్ డిజైనర్స్, లైట్ అండ్ 3డీ మ్యాపింగ్ ఆర్టిస్ట్స్ ఇలా అందరి ఆర్ట్ వర్స్స్‌ను ‘ఓపెన్ కాల్’లో భాగంగా ఆహ్వానిస్తోంది. ఇండివిడ్యుల్స్, గ్రూప్స్ ఎలా అయినా సరే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. నవంబర్ 22 నుంచి ప్రారంభమైన సబ్‌మిషన్స్ డిసెంబర్ 31 వరకు కొనసాగనున్నాయి. ప్రతి వారం వచ్చిన ఆర్ట్ వర్క్స్ నుంచి ది బెస్ట్ ఆర్ట్ వర్క్‌ను ఎంపిక చేసి బూర్జ్ ఖలీఫా భవనం మీద డిస్ ప్లే చేస్తారు. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన వివరాలతో పాటు డిజైన్ ఫార్మాట్స్, డైమెన్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అధికారిక బుర్జ్ ఖలీఫా.ఏఈలో చూడొచ్చు.