- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Champions Trophy-2025: సెమీస్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్.. తుది జట్లు ఇవే

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీస్ సమరానికి రంగం సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్‌నేషనల్ స్టేడియం (Dubai International Stadium) వేదికగా నేడు టీమిండియా (Team India), ఆస్ట్రేలియా (Australia)తో తలపడబోతోంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) ఏ మాత్రం సంకోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అదేవిధంగా భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవని.. న్యూజిలాండ్ (New Zealand)తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తెలిపారు. ఇక ఆసిస్ జట్టులో జాన్సన్ స్థానంలో తన్వీర్ సంగా (Tanvir Sanga) తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు తొలి సెమీ ఫైనల్‌లో ఎవరు గెలుపోంది ఫైనల్ చేరుతారోనని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా (Social Media) వేదికగా ఎవరికి గెలు అవకాశాలున్నాయో అంచనాలు వేస్తూ తమ ప్రిడిక్షన్‌ను పంచుకుటున్నారు.
ప్రతికారం తీర్చుకుంటారా..
కీలక టోర్నీలలో భారత విజయాలకు ఆస్ట్రేలియా (Australia) ప్రతిసారి అడ్డంకిగా మారుతోంది. ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025) తొలి సెమీఫైనల్ (First Semi Final) ఆసక్తిగా మారింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లోనూ భారత్ జట్టును ఆస్ట్రేలియా ఓడించింది విషయం తెలిసిందే. అయితే, ఈసారి ఎలాగైనా ఆసిస్‌పై విజయం సాధించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌కు చేరాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇప్పటికే భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి గ్రూప్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచింది.
భారత జట్టు..
రోహిత్ శర్మ (C), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఆస్ట్రేలియా జట్టు..
కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (C), మార్నస్ లాబుస్‌చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (WK), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంగా.