- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి
by Shyam |

X
దిశ, పరకాల టౌన్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గురువారం పట్టణంలోని పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈక్రమంలో శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ కమిటీ డైరెక్టర్ కోడెల ఆగయ్య సతీమణి కోడెల ప్రమీల బుధవారం నాడు గుండెపోటుతో మృతిచెందడం జరిగింది. విషయం తెలిసిన స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ప్రమీల పార్ధీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అదేవిధంగా కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న పిట్ట యాదగిరి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి సంతాపం తెలిపారు. యాదగిరి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పరకాల పట్టణ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Next Story