వైసీపీలో చేరిన చలమలశెట్టి సునీల్

దిశ, ఏపీ బ్యూరో: రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిన టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారం సీఎం  వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన్ని సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పెద్దాపురం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త దవులూరి దొరబాబు పాల్గొన్నారు.

Advertisement