మళ్లీ తెర మీదకు ‘ఛాయ్‌వాలా’

by Shamantha N |
మళ్లీ తెర మీదకు ‘ఛాయ్‌వాలా’
X

దిశ, వెబ్‌డెస్క్: 2014 ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రకటించబడిన సందర్భంలో తెరమీదకు వచ్చిన ‘ఛాయ్ వాలా’ మాట చాలా రోజుల తర్వాత ఇవాళ మళ్లీ వినబడింది. అది ఎవరి నోటి నుంచో కాదు. అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ నుంచి కావడం గమనార్హం. గుజరాత్ సందర్శనలో ఉన్న ట్రంప్ మొతేరా స్టేడియంలో ట్రంప్ మాట్లాడుతూ ఛాయ్‌వాలా నుంచి ఛాంపియన్‌గా ఎదిగిన మోడీ నాయకత్వంలోని భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌లో ఆర్థిక మందగమన ప్రభావం, నిరుద్యోగిత రేటు 45 ఏండ్ల గరిష్టానికి చేరుకున్న ఈ సందర్భంలో ట్రంప్ వ్యాఖ్యలు అసత్యాలనీ, మోడీ కోసమే అలా మాట్లాడారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారతవృద్ధి రేటు 5 శాతం కంటే తక్కువేనని ధృవీకరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు కొనుగోలు శక్తిలేక పార్లీ జీ బిస్కెట్ ప్యాకెట్లు కొనుగోలు కాకపోవడం, ఆ కంపెనీలో ఉద్యోగుల తొలగింపు, తగ్గిన వ్యవసాయవృద్ధి రేటు, రైతుల ఆత్మహత్యలు, ట్రంప్ పర్యటన సందర్భంగా గుజరాత్‌లో మురికివాడలు కనబడంకుండా గోడలు కట్టిన సంగతి వీటన్నింటిని గురించి తెలుసుకోకుండా ట్రంప్ వ్యాఖ్యానించడం సబబేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Read Also..

గుజరాతీ ప్రైడే.. భారత్ ప్రైడా?

Advertisement

Next Story

Most Viewed