చైత్ర నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్

by Sridhar Babu |   ( Updated:2021-09-14 06:02:04.0  )
చైత్ర నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: చిన్నారి చైత్రపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ గుర్రాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎంజేఆర్ యూత్ మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు యూత్ సభ్యులు ర్యాలీ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేయడం నిజంగా అమానుషం అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు రాజును బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇకమీదట ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పడకుండా కొత్త చట్టాలు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని కోరారు.

చైత్ర కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డీఆర్ఓ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డి.ప్రశాంత్, ప్రసాద్, ఆనంద్, సుమన్, రమణ, మలేష్, ప్రసన్న, కృపాకర్, ఉషా, కమల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story