IGNOU ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

దిశప్రతినిధి, హైదరాబాద్:

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU) 2020 ఏడాదికి సంబంధించి జూలై అడ్మిషన్లు కోరుతూ ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ రాజు బొల్ల బుధవారం ఒక ప్రకటనలోపేర్కొన్నారు. వివిధ రకాల ప్రోగ్రాములకు చెందిన సర్టిఫికెట్, PG సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ , పీజీ (Post graduation) ప్రోగ్రాములలో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

వివిధ రకాలుగా నిర్ణయించిన ప్రోగ్రాములైన సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశం పొందటానికి ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని ఎస్సీ , ఎస్టీ నిరుద్యోగ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఆయా ప్రోగ్రాముల్లో ప్రవేశం కొరకు అభ్యర్థులు సెప్టెంబర్ 15 వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో ఇగ్నో వెబ్‌సైట్ ద్వారా అడ్మిషన్లు పొందాలన్నారు. ఈ ప్రోగ్రాములకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలకు అభ్యర్థులు ఇగ్నో వెబ్‌సైట్ www.ignou.ac.inను సంప్రదిచాలని.. మరిన్ని వివరాలకు [email protected] కు మెయిల్ చేసి పొందవచ్చునని వివరించారు.

Advertisement