ఇంటర్ మూల్యాంకన కేంద్రం తనిఖీ : సీఈవో ఖాలిక్

by Shyam |
ఇంటర్ మూల్యాంకన కేంద్రం తనిఖీ : సీఈవో ఖాలిక్
X

దిశ, నిజామాబాద్ :
ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని రాష్ట్ర ఇంటర్ పరీక్షల నిర్వహణ అధికారి(సీఈఓ) మహమ్మద్ ఖాలిక్ తనిఖీ చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సారి జరుగుతున్న ఒకేషనల్ స్పాట్ వాల్యూవేషన్ క్యాంపులో వసతులను ఆయన పరిశీలించారు. లెక్చరర్లు మాస్కులు, భౌతిక దూరం పాటిస్తున్నారా లేదా అని అడిగి తెలసుకున్నారు.ఈ సందర్బంగా సీఈఓ మాట్లాడుతూ..అధ్యాపకులు జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే సమయంలో నిబద్దత కనబరచాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అంకిత భావంతో పనిచేయాలన్నారు. డిఐఈఓ ఒడ్డెన్న మాట్లాడుతూ..మూల్యాంకన కేంద్రాన్ని నిత్యం శానిటైజేషన్ చేస్తున్నామని, లెక్చరర్లకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే లోనికి అనుమతి ఇస్తున్నట్టు సీఈఓకు వివరించారు.కార్యక్రమంలో రజియొద్దీన్, చంద్రా విఠల్, శంకర్, ఏకినుద్దీన్, రామస్వామి గౌడ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story