ఆర్మీ క్యాంటీన్‌లో ఆ ఉత్తర్వులు వెనక్కి

by Shamantha N |
ఆర్మీ క్యాంటీన్‌లో ఆ ఉత్తర్వులు వెనక్కి
X

న్యూఢిల్లీ: ఆర్మీ క్యాంటీన్‌లలో 1,000 విదేశీ సరుకులను నిషేధించాలని కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఈ వెయ్యి సరుకుల నిషేధ జాబితాలో మనదేశ కంపెనీల ఉత్పత్తులూ ఉండటంతో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. విదేశీ సరుకుల జాబితా రూపకల్పనలో కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్ పొరబడిందని సీఆర్‌పీఎఫ్ వెల్లడించింది. బ్యాన్ చేసిన జాబితాలో న్యూటెలా, కిండర్ జాయ్, టిక్ టాక్, హార్లిక్స్ ఓట్స్, యూరేకా ఫోర్బ్స్, టామీ హిల్ఫైగర్ షర్ట్స్, ఆడిడాస్ బాడీ స్ప్రేలు, కొన్ని కంపెనీల మైక్రో ఓవెన్‌లు, ఇతర గృహోపకరణాలున్నాయి. వీటితోపాటు డాబర్, బజాజ్, ఉషాలాంటి స్వదేశీ కంపెనీల ఉత్పత్తులను నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే 1,000 సరుకుల నిషేధ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. స్థానిక సంస్థలు, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు తర్వాత సీఏపీఎఫ్ క్యాంటీన్‌లలో విదేశీ సరుకులను నిషేధించాలని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed