- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ తయారీ పరిశ్రమలకు పీఎల్ఐ ప్రోత్సహకాలు
దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ కండీషనర్లు(ఏసీ), ఎల్ఈడీ లైట్ల పరిశ్రమ, అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్‌కు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దేశీయ తయారీని పెంచేందుకు, ప్రపంచవ్యాప్తంగా పోటీని ఎదుర్కొనేందుకు కేంద్రం పీఎల్ఐ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఏసీలు, ఎల్ఈడీల కోసం ఈ పథకాన్ని అందించడం ద్వారా దేశీయ తయారీలో ఉత్సాహం పుంజుకుంటుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు. ఈ పథకం ద్వారా సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ కర్మాగారాల్లో 10 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ. 4,500 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్రం అందించనుంది. అలాగే, ఏసీలు, ఎల్ఈడీ తయారీ పరిశ్రమకు రాబోయే ఐదేళ్ల కాలానికి రూ. 6,238 కోట్ల ప్రోత్సాహకాలను అందించనుంది. ఈ నిర్ణయం ద్వారా పరిశ్రం రూ. 1.68 లక్షల కోట్లకు, ఎగుమతులు రూ. 64,400 కోట్లకు చేరుకుంటుందని కేంద్రం అంచనా వేసింది. అంతేకాకుండా ఐదేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల ఉద్యోగాల సృష్టి ఉంటుందని కేంద్ర భావిస్తోంది.