అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలకు హెచ్చరిక

by  |
అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలకు హెచ్చరిక
X

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా బేసిన్ పరిధిలోని వారు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేంద్ర జలసంఘం హెచ్చరించింది. బుధవారం ఆయా రాష్ట్రాలకు అత్యవసర సమాచారం పంపింది. మహాబలేశ్వరం, కోయినా డ్యామ్ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుండడంతో దిగు ప్రాంతాలకు భారీ వరద నీరు చేరే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు ఈ నెలలోనే భారీ వరద నీరు వస్తుందని, ఈ రెండు, మూడు రోజుల్లోనే 75 శాతం వరకు ప్రాజెక్టులకు నీరు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ హెచ్చరికలు జారీ చేసింది.


Next Story

Most Viewed