గాంధీని సందర్శించిన కిషన్‌‌రెడ్డి

దిశ, సికింద్రాబాద్: కరోనా కేసులు, మరణాల సంఖ్య విషయంలో దాపరికం అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ఉన్న సమస్యలపై రోగులు, మెడికల్ సిబ్బంది, పారమెడికల్, పారిశుద్ధ్య కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ హాస్పటల్స్, బెడ్స్ ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఇప్పుడు గ్రామాలలో కూడా పొజిటివ్ కేసులు పెరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో సర్పంచ్ దగ్గరి నుంచి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రతి ఒక్కరు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యం.రాజారావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement